రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
Ens Balu
2
Vizianagaram
2020-12-21 22:20:30
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారి శ్రేయస్సుకు పెద్దపీట వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు. బ్యాంకర్లు ముందుకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జరిగిన జిల్లా స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీ సమావేశంలో, 2021-22 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్, రబీ పంటల వారీ రుణపరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ను నిర్ణయించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి జనార్ధన్ ముందుగా ఆయా పంటలకు నిర్ణయించిన రుణపరిమితిని వివరించగా, దానిపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి ఖరారు చేశారు. ఈ సమావేశంలో ఎల్‌డిఎం శ్రీనివాసరావు, నాబార్డు ఏజిఎం హరీష్, వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, పశుసంవర్థకశాఖ జెడి డాక్టర్ ఎంవిఏ నర్సింహులు, ఉద్యానశాఖ డిడి ఆర్.శ్రీనివాసరావు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, ఆదర్శ రైతులు, స్వచ్ఛంద సంస్థలు, సహకారబ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. రస్తాకుంటుబాయి కృషి విజ్ఞానకేంద్రం రూపొందించిన పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
పంటల వారీగా ఎకరాకు రుణపరిమితి(రూపాయల్లో) ః
వరి 32000-36000, శ్రీవరి 30000-32000, చెరకు(ప్లాంటేషన్) 65000-69000, చెరకు 55000-60000, అరటి (ప్లాంటేషన్) 55000-70000, అరటి 38000-50000, అరటి టిష్యూకల్చర్ (ప్లాంటేషన్) 90000-95000, అరటి రాటూన్ 50000, వేరుశనగ 25000-27000, కందులు 13000-18000, జ్యూట్ 11000, సన్‌ఫ్లవర్ 15000-19000, మిర్చి 66000-88000, కూరగాయలు 30000-35000, భజ్రా 12500-18000, రాగులు ఇరిగేటెడ్ 14000-17000, అన్ ఇరిగేటెడ్ 12000-13000, మొక్కజొన్న 30000-34000, అన్ ఇరిగేటెడ్ 19000-23000, జొన్న 17000-20000, అన్ ఇరిగేటెడ్ 16000-18500.