కరోనా పంజా.. విశాఖలో ఒకేరోజు ఆరుగురు మ్రుతి
Ens Balu
2
Visakhapatnam
2020-08-09 20:54:36
విశాఖజిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. కేసులతో పాటు మరణాలు కూడా అదే స్థాయిలో సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ కేసులు అధికమైన దగ్గర నుంచి ఆదివారం ఒక్కరోజే ఆరుగురు వ్యక్తులు కరోనాతో మ్రుతిచెందడం జిల్లా వాసులను భయపెట్టింది. విశాఖ జిల్లాలో 961 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు19,905 కేసులు నమోదు కాగా వీటిలో 12,361 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 74 12 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తాజాగా 20 నూతన క్లస్టర్ లను ఏర్పాటు చేశారు. అత్యవసర పనులకు తప్పా ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ జిల్లా వాసులను కోరారు.