ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు..
Ens Balu
2
Visakhapatnam
2020-12-21 22:38:52
మనసున్నమనిషి,నిండైన మనసుతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 35వ వార్డులో వైసీపీ యూత్ మాజీ అధ్యక్షుడు విల్లూరి భాస్కర రావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వాసుపల్లి ముఖ్య అతిధిగా హాజరై అభిమానులు,కార్యకర్తల ఆనందోత్సహాల మధ్య కేక్ ను కట్ చేసి వేడుకల్లో భాగమయ్యారు.వాసుపల్లి మాట్లాడుతూ, అంబేదర్క్ కు మరోరూపంగా జగన్ అనేక సంక్షేమ పధకాలు చేస్తున్నాడని కొనియాడారు.రానున్న ముప్పై ఏళ్ల వరకు ఆంధ్రకు జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అన్నారు.విల్లూరి భాస్కర రావు మాట్లాడుతూ వెన్నుచూపని పోరాట స్ఫూర్తి,కార్యదీక్ష ఆయుధాలు గా జగన్ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.మెండుగా ప్రజాభిమానం,తండ్రి దీవెనలు,భగవంతుని ఆశీస్సులే జగన్ బలమన్నారు.అందరూ బాగుండాలని,ప్రతి ఇంటా సంతోషాలు నింపాలనే సదుద్దేశంతో,నిండైన మనసుతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న జన హృదయ నేత జగన్ అని కొనియాడారు.అనంతరం వాహన మిత్ర పధకం ద్వారా లబ్ధిపొందిన ఆటో కార్మికుల ర్యాలీని వాసుపల్లి జెండా ఊపి ప్రారంభించారు.వృద్దులకు,పేదలకు,అభిమానులకు నాలుగు రకాల పండ్లు,చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసి విల్లూరి అభిమానులు,కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. మందుగుండు సామాగ్రి వెలుగులు, వివిధరకాల కళాకారుల నృత్యాలతో జరిగిన వేడుకల్లో అభిమానులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.