దళిత వ్యతిరేక విధానాలు మానుకోవాలి..


Ens Balu
2
Visakhapatnam
2020-12-21 22:45:40

దళితుల అణిచివేత చర్యలను ప్రభుత్వం మానుకోవాలని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం డిమాండ్ చేసారు. సామజిక న్యాయమే ధ్యేయంగా,దళితులపై జరుగుతున్న అకృత్యాలు,దాడులకు నిరసనగా  విశాఖలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత మహిళలపైన జరుగుతున్న అకృత్యాలు,దాడులను ఆరికట్టేవిధంగా కఠిన చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేసారు. దళితులపైన జరుగుతున్న హత్యాయత్నాలు,శిరోముండనాలు అరికట్టాలని,దళిత ఉద్యోగులు,అధికారులపై వివక్షచూపరాదని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నూతన చట్టాన్ని రద్దుచేసి, పాతపద్ధతిలోనే నడిపించి,పేద ఎస్సీ  విద్యార్థులను ఆదుకోవాలన్నారు. చట్టాల అమలులో అగ్రకులాల మహిళలకు ఒక న్యాయం,దళిత మహిళలకు ఒకన్యాయమా అని ప్రశ్నించారు. అలాగే ప్రవేటు యాజమాన్యంలో కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసారు.ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీలకు షూరిటీ లేకుండా స్వయం ఉపాధి లోన్లు ఇవ్వాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. అలాగే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదుచేసినవెంటనే నిందితులను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేసారు. భూ కబ్జాదారులను,మతోన్మాద శక్తులను తరిమికొట్టాలని  పిలుపునిచ్చారు.తమ డిమాండ్లను ప్రభుత్వాలు వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే దళితులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చింతాడ సూర్యానికి మద్దతుగా అనేకమంది దళిత నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కృష్ణారావు,దమయంతి,చింతాడ ప్రదీప్,తాతాజీ,కొత్తపల్లి కటరమణ,తాతాజీ,ఎస్.సుధాకర్,గండి రాజేశ్వరి,ఫ్రాంక్లిన్ ఈశ్వరమ్మ,పూడి అంజు,ధనలక్ష్మి,కల్యాణరావు తదితరులు ఈ దీక్షలో సూర్యానికి మద్దతుగా పాల్గొన్నారు.