అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం..


Ens Balu
4
Kurnool
2020-12-21 22:51:33

కర్నూలు నగరంలో ప్రధాన రహదారులు, పార్కింగ్ స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్న ఆక్రమణలపై కర్నూలు నగర పాలక అధికారులు(పట్టణ ప్రణాళిక అధికారులు) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందుకు సోమవారం నగరం నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన కూల్చివేతే ఇందుకు నిదర్శనం.  కొండారెడ్డి బురుజు సమీపంలో ఉన్న శ్రీ శ్రీనివాస క్లాత్ మార్కెట్ కి సంబంధించిన పార్కింగ్ స్థలంలో నిర్మించిన 7 అక్రమ కట్టడాలను(దుకాణాలు) సోమవారం నగర పాలక పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు పూర్తి విచారణ అనంతరం పార్కింగ్ స్థలాలను అక్రమించారన్న కారణంతో రెండు నెలల కిందటే వీరితో పాటు షరాఫ్ బజార్ లోని పలు దుకాణాల యజమానులకు  నోటీసులు జారీ చేశారు. సరైన ఆధారాలు కానీ అప్పటి ప్లాన్ పత్రాలు కానీ సదురు యజమానుల వద్ద ఉంటే తమకు చూయించాలని లేని పట్టణ ప్రణాళిక అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసుల్లో ఇచ్చిన రెండు నెలల గడువు ముగిసినా మరో వారం రోజుల సమయం ఇచ్చినా వారి నుంచి ఎటువంటి ఆధారాలు,  ప్లాన్ కు సంబంధించిన పత్రాలు కానీ, సమాధానం రాకపోగా కూల్చివేసినట్లు డీసీపీ(డిప్యూటీ సిటీ ప్లానర్) కోటయ్య పేర్కొన్నారు. 50 ఏళ్ల కిందట ప్రస్తుతం ఉన్న వేంకట చలపతి కల్యాణ మండపం ఉన్న స్థలాన్ని గ్రంధాలయానికి వినియోగించుకోవాలని నిబంధన ఉన్నా... ఆ పార్కింగ్ స్థలంలో అక్రమ నిర్మాణాలను నిర్మించుకున్న కొందరు యజమానులు కూల్చివేతలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 24 వ తేదీ వరకు కోర్టు స్టే విధించడం జరిగింది. తదనంతరం కోర్టు ఆదేశాల మేరకు షరాఫ్ బజార్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు తెసుకుంటామని నగర పాలక అధికారులు తెలియజేస్తున్నారు. నగరంలో మొత్తం 1700 అక్రమ భవనాలు ఉన్నట్లు గుర్తించి వాటి యజమానులకు కూడా నోటీసులు అందజేశామని డిసిపి కోటయ్య చెబుతున్నారు.