చిన్నారుల మధ్య సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు..


Ens Balu
1
Visakhapatnam
2020-12-22 15:54:30

ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్య మంత్రి  వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు విశాఖలోని 39 వార్డు లో గల మదర్ ఏ సా దావతుల్ హఖ్ అరబ్బిక్ స్కూలులో ఏపి బిసిషేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సబీరా బేగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పాఠశాలలోని చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, బిసిలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమేనని అన్నారు. అలాంటి తమ అధినేత పుట్టినరోజు వేడుకలను చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా వుందన్నారు. జగనన్నకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని, ఆయన ఇష్టానికి అనుగుణంగా చిన్నారుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నామన్నారు. బీసీలంతా సీఎం వెంటే ఉంటారని, దేశంలోనే తిరుగులేని సీఎం జగన్ మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  మదర్సా ఇమామ్, హఫీస్, ఓవైష్ కర్ణి, అయాజ్ కేసర్, ఎజాజ్ అహ్మద్, జ్యోతి భాస్కర్, సద్దాం హుస్సేన్, సయ్యద్ అఫ్రిది అంబాబు తదితరులు పాల్గొన్నారు.