జగనన్నతోడు లక్ష్యాలు పూర్తికావాలి..


Ens Balu
3
Visakhapatnam
2020-12-22 19:47:29

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు, జగనన్న స్వానిధి పధకాల క్రింద లబ్ధిదారులకు ఋణ మంజూరు ఇచ్చిన టార్గెట్ మేరకు పూర్తి  చేయాలని బ్యాంకు అధికారులకు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన కోరారు. మంగళవారం, జివిఎంసి పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావుతో కలసి కమిషనర్ కంచరపాలెం ప్రాంతాలలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు బ్రాంచీలను సందర్శించి ఈ పధకం క్రింద సమర్పించిన దరఖాస్తు దారులకు టార్గెట్ మేరకు ఋణాల మంజూరు చేయడంలో జాప్యం జరుగుతుండటాన్ని గుర్తించి సంబంధిత బ్రాంచి మేనేజర్లుకు తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. ప్రతిష్టాత్మకమైనటువంటి పధకాలు క్రింద ఋణ మంజూరులో అలసత్వం ఉపేక్షించబోమని జివిఎంసి డిపాజిట్లు ఆ బ్యాంకుల వద్ద ముగించడానికి కూడా వెనకాడబోమని కమిషనర్ హెచ్చరించారు. ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులతో మాట్లాడుతూ రెండు రోజులలో పధకాల క్రింద సమర్పించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ఋణాలు మంజూరు చేసే విధంగా తగు సూచనలు బ్రాంచ్ మేనేజర్లుకు అందించవలసినదిగా కోరారు. ఎక్కువగా దరఖాస్తులు పెండింగ్ ఉన్న బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లతో ఏ.పి.డి.లు సంప్రదించి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా ఋణ మంజూరు..  ఆయా బ్యాంకులు చేసే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని పి.డి. (యు.సి.డి.) వై. శ్రీనివాసరావు కు సూచించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, నాల్గవ జోనల్ కమిషనర్ పి. సింహాచలం, కమ్యునిటీ ఆర్గనైజర్లు, వార్డు సంక్షేమ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.