మంత్రి అవంతిని కలిసిన హౌసింగ్ పీడి..


Ens Balu
1
Visakhapatnam
2020-12-23 14:27:37

విశాఖజిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును మర్యాద పూర్వకంగా కలిశారు. విశాఖజిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంత్రిని కలిసి పుష్ఫగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇళ్ళు అందించడంలో  గృహ నిర్మాణ శాఖ కీలకంగా వ్యవహరించి ప్రభుత్వానికి పేరు తీసుకు రావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శాఖ అధికారులు మిగిలిన శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో అనర్హులను దూరంగా పెట్టి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఇంటి సమస్యలకు సంబంధించి ఏ సమస్యపై అర్జీలు వచ్చినా పరిష్కరించడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా కీలకంగా వ్యవహరించాలని శ్రీనివాసరావుకు సూచించారు. మంత్రిని కలిసిన వారిలో డిఈలు,ఏఈలు ఉన్నారు.