పక్కా కొలతలతో నిత్యవసర సరుకులు..
Ens Balu
1
Machilipatnam
2020-12-23 17:17:09
లబ్ధిదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నారని ఒక్కప్పుడు 30శాతం మాత్రమే ఉన్న రీసైక్లింగ్ వ్యాపారులు నేడు రెట్టింపైనట్లు అందుకే వాటి నివారణకు పౌర సరఫరాల విభాగంలో నూతన విధానం మొదలు కానుందని పేద ప్రజలకు అందాల్సిన నిత్యావపర సరుకుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం ఇకపై జాగ్రత్త వహించనుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి స్వయంగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత మచిలీపట్నం పరాసుపేటకు చెందిన ఫిరాజున్నిసా అనే మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. తాము బ్యాంకు నుండి గృహ సంబంధిత రుణం తీసుకొనేందుకు ఐ టి రిటర్న్స్ దాఖలు చేశామని, ఇప్పుడు తమకు అమ్మఒడి డబ్బులు రావడం లేదని, తమ పాప విద్యా దీవెన డబ్బులు రావడం లేదని అలాగే స్థలాలకు దరఖాస్తు చేసుకొన్నా అవి దక్కలేదని తమకు కనీసం రేషన్ కార్డు సైతం మంజూరు కాలేదని ఆ మహిళ వాపోయింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నవశకం పేరుతో గ్రామాల్లో వలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించిందని ఆమెకు గుర్తు చేశారు. ఇంటింటికీ వెళ్లి తెల్ల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారుల సమగ్ర సమాచారాన్ని సేకరించారన్నారు . నాలుగు చక్రాల వాహనం ఉన్నా..ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, ఐదు ఎకరాల భూమి ఉన్నా, ఆదాయ పన్ను ( ఐ టి ) కడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులందరినీ ఆ సర్వేలో గుర్తించి వారి జాబితాను పౌర సరఫరాల శాఖకు అందించారని తెలిపారు.
గతంలో రేషన్‌షాపుల నుంచే బియ్యాన్ని దారి మళ్లించగా, ఇప్పుడు వ్యాపారులు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారని ఆ సేకరించిన బియ్యాన్ని రైస్‌మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వాహనాల్లో తరలిస్తుండటంతో రేషన్ బియ్యం పోలీసులకు తరుచూ పట్టుబడుతున్నాయి.గ్రామాల్లో కొందరు లబ్ధిదారులు దొడ్డుగా ఉన్న రేషన్ బియ్యం తినలేక చిన్న వ్యాపారులకు కిలోకు రూ.6 నుంచి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో బియ్యం దందా చేసే పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గంలో మహారాష్ట్ర, హైదరాబాద్ పరిసరాల్లోని కోళ్లఫారాలకు సైతం తరలిస్తున్నారాని చెప్పారు. అక్కడ మిల్లర్లకు కిలోకు రూ.22కు విక్రయిస్తున్నారు. అంటే దళారులు కిలోకు రూ.16 నుంచి రూ.12 వరకు లాభం పొందుతున్నారు. అయితే గ్రామాల్లో నుంచి మిలర్ల వద్దకు తరలించేందుకు వ్యాపారులు కొత్త మార్గాలనే అనుసరిస్తున్నారు. ఈ దందాలో రోజువారీ కూలీల నుంచి బడా వ్యాపారుల వరకు ఉన్నారు. రెండు మూడు క్వింటాళ్లు సేకరించి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. రేషన్ బియ్యం అనేది గుర్తుపట్టకుండా ప్రముఖ బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి రవాణా చేస్తున్నట్లు వివరించారు.
ఈ తరహా మోసాలను నివారించేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాలను ఇకపై పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారునికి రేషన్ ఇచ్చిన సమయంలో లబ్ధిదారు మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వలంటీర్లు ట్యాబ్ లో ఎంటర్ చేస్తే సరుకులు డెలివరీ ఇచ్చినట్లు లెక్క అని మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రభుత్వం నూతన ఏడాది నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు సబ్సిడీపై ప్రభుత్వం వాహనాలను మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.