విజిలెన్స్ ఏఎస్పీగా జి.స్వరూపారాణి..


Ens Balu
2
ఎంవిపీ కోలనీ
2020-12-23 18:04:49

రీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ అడిషల్ ఎస్పిగా జి.స్వరూపరాణిని ప్రభుత్వం నియమించింది. ఈమేరకు విశాఖలోని ఎంవీపీకాలనీలోని కార్యలయంలో ఆమె బుదవారం బాధ్యతలు స్వీకరించారు. 2012 బ్యాచ్ కు చెందిన ఆమే శ్రీకాకుళం, పాలకొండ , హైదరాబాద్ , గుంటూరు తదితర జిల్లాల్లో డిఎస్పి గా విధులు నిర్వహించారు. అనంతరం 2019 లో విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి గా పనిచేశారు. ముఖ్యంగా మహిళలకు చట్టాలపై అవగహన కల్పించటం, మహిళల ఫిర్యాదులపై తక్షణం స్పందించడం, తదితర వాటిలో కీలకంగా వ్యవహరించేవారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సేవలు పక్కదారి పట్టినా, నాణ్యత లోపించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించని హొటళ్లు, రెస్టారెంట్లు, మిల్లర్లుపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఉండి తప్పులను దైర్యంగా పోలీసులకు చెప్పేలా తయారు కావాలన్నారు. ఈమేరకు బాద్యతలు స్వీకరించి ఆమేకు విజిలెన్స్ అదికారులు పుష్ప గుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిసిఅభినందనలు తెలియజేసారు.