ఆర్ఆర్ఆర్ పథకం జాబితా సిద్ధం చేయాలి..


Ens Balu
3
Anantapur
2020-12-23 18:32:38

అనంతపురం జిల్లాలో  జనవరి 5వ తేదీ లోపు జిల్లాలోని అన్ని చెరువులను  ఆర్.ఆర్.ఆర్ పథకం కింద అమలయ్యే విధంగా  జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు.  బుధవారం స్థానిక కలెక్టరేట్లోని  మినీ కాన్ఫరెన్స్ హాల్ లో  ఆర్.ఆర్ ఆర్  పథకం  అమలుపై  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన  డి ఎల్ సి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మైనర్ ఇరిగేషన S.E సుధాకర్,  DWMA పి డి  వేణుగోపాల్,  సంబంధిత ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలోని అన్ని చెరువులను  ఆర్ ఆర్ ఆర్ పథకం కింద  అమలయ్యే విధంగా  జాబితా  సిద్ధం చేయాలని అందుకు  డివిజన్ మైనర్ ఇరిగేషన్  ఇంజనీర్లు. మరియు  గ్రౌండ్ వాటర్,  dwma, ఆర్డబ్ల్యూఎస్,  అధికారుల  సంయుక్త  పర్యవేక్షణలో  కార్యక్రమాలను చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. అన్ని నియోజకవర్గంలోని చెరువులను కూడా  గుర్తించాలని తెలిపారు. 5  హెక్టార్ల నీటితో నింపబడిన భూమి కలిగిన చెరువును గుర్తించాలని తెలిపారు.   చెరువుల నీటి సామర్థ్యం తదితర వివరాలన్నీ  సేకరించి వలెనని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఈ పథకంపై  అమలుకు  ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు  తెలిపారు.  జిల్లాలోని చెరువుల సమగ్రాభివృద్ధి కొరకు  ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్ఆర్ పథకం కింద జిల్లా ఆమోదం పొంది.   ఆమోదంపొందిన తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ కి  సిఫార్సు   చేయడంజరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం అమలుపై సంబంధిత  ఇంజనీర్లతో  టెలికాం  కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.    ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ అధికారి తిప్పేస్వామి, మైనర్ ఇరిగేషన్ డిప్యూటీ S.E. రామకృష్ణయ్య, డివిజన్ మైనర్ ఇరిగేషన్  ఇంజనీర్లు  నారాయణ నాయక్, హరినాథ్, వెంకట రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.