ఇక హార్టికల్చర్ 2ఏళ్ల డిప్లమా కోర్సు..


Ens Balu
3
Vizianagaram
2020-12-23 19:01:14

విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లో హార్టికల్చర్ ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును విద్యార్థుల అభ్యర్ధన మేరకు వీసీ ఆచార్య టివి కట్టిమని ఆదేశాల మేరకు డిప్లొమాకోర్సుగా మార్పుచేసినట్లు  యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్, ఇంచార్జి రిజిస్ట్రార్ ప్రోఫెసర్ హనుమంతు లజిపతిరాయి తెలియజేశారు. బుధవారం విద్యార్థుల అభ్యర్ధన మేరకు వీసీ ప్రోఫ్రీసర్ టివి కట్టిమని ఆదేశాల ఆదేశానుసారం కోర్సుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డ్ ఆఫ్ స్టడీస్  మెంబెర్లు  ఏపీ హార్టికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ బి ప్రసన్నకుమార్, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ బి పడాల్, విజయనగరం జిల్లా డైరెక్టర్ ఆర్ శ్రీనివాసరావు సమావేశమై రెండవ సంవత్సరం సిలబస్ రూపొందించారు. ఈ కోర్సు చదివే విద్యార్థులకు జీవనోపాధి, ఉద్యోగావకాశాలు లభించే విధంగా కోర్సును రూపొందించినట్లు చెప్పారు. సమావేశంలో యూనివర్సిటీ అడ్మిన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్వివిసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.