పరదేశమ్మ ఆలయ సమస్య పరిష్కరించండి..
Ens Balu
3
Visakhapatnam
2020-12-24 12:49:47
విశాఖలోని రైల్వేన్యూకాలనీ దగ్గర శ్రీపరదేశమ్మ ఆలయ స్థలాన్ని రైల్వే అధికారులు మూసివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ ఎంవివి సత్యన్నారాయణలు రైల్వే అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లారు. గురువారం ఈ మేరకు డిఆర్ఎంకు వినతిపత్రం ఇచ్చి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రైల్వే న్యూకాలనీలోని అమ్మవారి ఆలయానికి వెళ్లడానికి వీలు లేకుండా 31పాత/42కొత్త వార్డ్ రైల్వే న్యూ కోలనీ లో శ్రీ పరదేశమ్మ అమ్మ వారి ఆలయానికి రైల్వే క్వార్టర్స్ గోడ మార్గం గుండా వెళ్లే 5అడుగుల మార్గాన్ని రైల్వే అధికారులు మూసివేస్తున్న కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందిచారని చెప్పారు. అంతకు ముందు అమ్మవారి ఆలయ స్థలాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లో 42వార్డ్ ప్రెసిడెంట్ జుబేర్, 32వార్డ్ ప్రెసిడెంట్ మూలే రామిరెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ఆళ్ల శివ గణేష్, స్థానికులు భాషా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.