ఘనంగా క్రిస్ మస్ వేడుకలు..
Ens Balu
3
Srikakulam
2020-12-24 14:04:27
శ్రీకాకుళం నగరంలోని లెప్రసి కాలనీలో సి.వి.నాగజ్యోతి వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో బుధవారం ఉదయం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నపిల్లలతో క్రిస్మస్ కేక్ కట్ చేయించి వారికి తినిపించారు. కాలనీ వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, అందరూ సుఖ:సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా 4గురు దివ్యాంగులకు ట్రైనైకిళ్లను పంపిణీ చేసారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని సి.వి.నాగజ్యోతి వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు సుమారు నెలరోజులకు సరిపడే నిత్యావసర సరుకులు, సబ్బులు, దుప్పట్లను కలెక్టర్ కాలనీ వాసులకు పంపిణీచేసారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు, జిల్లా లెప్రసీ అధికారి ప్రియా రంజిత్ పట్నాయక్, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ కె.జీవన్ బాబు తదితరులు పాల్గొన్నారు.