ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివ్రుద్ధి పనులు..కమిషనర్
Ens Balu
2
Tirupati
2020-08-10 08:58:30
మూడో వార్డు నారాయణపురం ప్రజల సౌకర్యార్థం కోసం నిర్వహిస్తున్న సి సి డ్రైవ్ 45 లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ గిరీష పరిశీలించారు. అనంతరం వార్డు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ మరియు కాంట్రాక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కాలవలుపైన అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూడాలని కాలువల పైన ఆక్రమణలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని ఆవార్డు ప్రజలకి సూచించారు. గతంలో రెండు పెద్ద కాలువలు కోసం 90 లక్షల రూపాయలతో నిర్వహించడం జరిగిందని, ఈ పెద్ద కాలువలు అంబేద్కర్ లా కాలేజ్ నుండి ఆటో నగర్ పెద్ద కాలువలోకి కలుస్తుందని తెలియజేశారు, గతంలో అవార్డు ప్రజలు కాలవలు లేక చాలా ఇబ్బంది కలుగుతుంది, వర్షం నీరు ఇళ్లల్లోకి వస్తున్నదని అభ్యర్థించడం జరిగిందని ఆ వార్డు ప్రజల కోసం 45 లక్షలు రూపాయలతో పెద్ద కాలువలు నిర్వహించడం జరుగుతుందని, మన నగరం అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అనంతరం కమిషనర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులు మరియు శానిటరీ సూపర్వైజర్లు తో రేణిగుంట రోడ్డు తుకివాకం వద్ద తడి చెత్త, పొడి చెత్త కోసం షెడ్లు, కొత్త రోడ్ల కు స్మార్ట్ సిటీ ద్వారా అంచనాలు వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఉత్పత్తయ్యే తడి, పొడి చెత్తలు వేరు చేసి వర్మి కంపోస్టు తయారు చేసే విధానం, ప్లాస్టిక్ వేరు చేసే విధానంలోకి రెండు కొత్త షెడ్లు వేయడం కోసం కమిషనర్ పరిశీలించి రెండు మూడు రోజుల లోపల అంచనాలు తయారు చేయాలని తుకివాకం నగరపాలక సంస్థ సంబంధించి స్థలాల్లో చుట్టు చెట్లు నాటాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్.ఈ. చంద్రశేఖర్,డి.ఈ.రఘుకుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ 2 షణ్ముగం, శానిటరి సూపర్వైజర్ చెంచయ్య, సర్వేయర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.