శానిటేషన్ సిబ్బంది సేవలు భేష్..
Ens Balu
1
విఎల్ పురం
2020-12-24 16:15:56
కొవిడ్-19 సమయంలో సానిటరీ సిబ్బంది అందించిన సేవలు స్ఫూర్తిదాయమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు, వైెస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్ మార్గాని భరత్ రామ్ అన్నారు. గురువారం విఎల్ పురంలోని ఎంపీ కార్యాలయంలో 31వ వార్డుకు చెందిన వలంటీర్లు, శానిటరీ వర్కర్లు, వాటర్ వర్స్క్ సిబ్బంది, రేషన్ షాపుల డీలర్లకు మాజీ కార్పొరేటర్ మజ్జి నూకారత్నం, వైెస్సార్సీపీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్ రామ్ పాల్గొని సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ సరంద్భంగా ఎంపీ మాట్లాడుతూ, కొవిడ్ -19 సమయంలో ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు సేవలు అందించిన వారికి ఎంత చేసినా తక్కువనేనని అన్నారు. ముఖ్యంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందితోపాటు, వార్డు వలంటీర్లు, వాటర్ వర్స్క్ సిబ్బంది, రేషన్ షాపుల డీలర్లు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. వార్డు వలంటీర్లు, వాటర్ వర్స్క్ సిబ్బంది, రేషన్ షాపుల డీలర్లుకు శాలువాలతో సత్కరించి మెమోంటోలను ఎంపీ అందించారు. ఈ కార్యక్రమంలో వైెస్సార్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, తదితరులు పాల్గొన్నారు.