అజాత శతృవు పెనుమత్స సాంబశివరాజు అస్తమయం..


Ens Balu
3
Gajapatinagaram
2020-08-10 10:21:11

అజాతశత్రువు మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందు తూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సాంబశివరాజు రెండు సార్లు మంత్రిగా, ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మంత్రి బొత్స వంటి హేమాహేమీలకు రాజకీయ గురువుగా సాంబశివరాజు గుర్తింపు పొందారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిద విజయరాంపురం ఆయన స్వగ్రామం. రాజకీయ జీవితంలో అవినీతి ఆరోపణలు, శత్రువులు లేని ఏకైక మహోన్నత వ్యక్తి. ఈయన మృుతిపట్ల వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సిఫార్సు