జగనన్నతోడు లక్ష్యాలను పూర్తిచేయాలి..


Ens Balu
1
Visakhapatnam
2020-12-24 18:24:47

జగనన్న తోడు  కార్యక్రమం లో  జి.వి.ఎం .సి పరిధిలోని  చిరువ్యాపారులకు రుణాలు మంజూరు  లక్ష్యాలను  చేరుకోవడానికి   జోనల్ కమిషనర్లు  శ్రద్ద వహించాలని  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  అన్నారు.  గురువారం విశాఖ  కలెక్టర్ కార్యాలయంలో   జగనన్న తోడు  కార్యక్రమం పై   జి.వి.ఎం .సి  అధికారులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనాథ్, డి ఆర్ డి ఎ  పి డి  విశ్వేశ్వరరావు ల తో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  చిరువ్యాపారులకు   ఆర్థిక వెసులు బాటు  ఇచ్చేందుకు  జగనన్న తోడు కార్యక్రమం అమలుకు  అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని  తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం  జగనన్న తోడు  కార్యక్రమ  లక్ష్యాలను పూర్తి చేయడానికి  నిర్థిష్ట కార్యచరణ  ప్రణాళిక  ప్రకారం  పని చేయాలని బ్యాంకర్లకు స్పష్టం చేసిందని తెలిపారు.  పెండింగ్ లో నున్న ధరఖాస్తులను  సత్వరమే  బ్యాంకు అధికారులతో  సమన్వయం చేసుకొని  పరిష్కరించడానికి  జోనల్ కమిషనర్లు  శ్రద్ద వహించాలని   కోరారు.  జోనల్ కమిషనర్లు  వారి పరిధిలోని అన్ని బ్యాంకుల అధికారులతో   పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులపై  సంప్రదించాలని కోరారు. జి.వి.ఎం .సి పరిధిలోని  8 జోన్లలో  పెండింగ్ లో ఉన్న 14,000  ధరఖాస్తుదారులకు   సత్వరమే రుణాలు మంజూరు చేయించాలని   కలెక్టర్ ఆదేశించారు.  అలాగే  వై ఎస్ ఆర్ భీమా పథకంలో   ధరఖాస్తు దారుల తరుపున  ప్రభుత్వం  భీమా ప్రీమియం ను   చెల్లించిందని , ధరఖాస్తులను  ప్రాసెస్ చేయించి  ఆయా వ్యక్తులకు   ఇన్సూరెన్స్ పాలసీ  డాక్యుమెంట్ లను  అందించడానికి   జోనల్ కమిషనర్లు  భాద్యత తీసుకోవాలని  తెలిపారు.  ఈ కార్యక్రమంలో   జి.వి.ఎం .సి కమిషనర్  జి.సృజన , జాయింట్ కలెక్టర్ గోవిందరావు,    డి ఆర్ డి ఎ  పి డి  విశ్వేశ్వరరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనాథ్ జోనల్ కమిషనర్లు, యు సి డి  పిడి  శ్రీనివాసరావు,  ఇతర అధికారులు పాల్గొన్నారు.