క్రిష్ణాజిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన..


Ens Balu
2
Vijayawada
2020-12-24 18:31:18

భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు 3 రోజుల పర్యటన కోసం కృష్ణాజిల్లాకు రానున్నారని విజయవాడ సబ్ కలెక్టరు హెచ్. యం. ధ్యానచంద్ర పేర్కొన్నారు. గురువారం గన్నవరం విమానాశ్రయం, ఆత్కూరు, సూరంపల్లి గ్రామాలలో ఉపరాష్ట్రపతి పర్యటన కోసం ముందస్తు భద్రతా ఏర్పాట్లను ఉన్నతస్ధాయి అధికారులతో కలిసి సబ్ కలెక్టరు పర్యవేక్షించారు. ఈసందర్భంగా సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర అధికారులతో సమీక్షిస్తూ కరోనా నేపథ్యంలో పర్యటనా ఏర్పాట్లను అత్యంత కట్టుదిట్టంగా చేపట్టాలన్నారు. పరిమిత సంఖ్యలోనే గౌరవ ఉపరాష్ట్రపతి పర్యటనలో అనుమతించాలన్నారు. డిశంబరు 27 ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉపరాష్ట్రపతి సాయంత్రం 4.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ ప్రముఖులతో ఆహ్వాన భేటీ అనంతరం సాయంత్రం 5.10 గంటలకు ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టు చేరుకుని రాత్రి బస చేస్తారు. డిశంబరు 28వ తేదీ సోమవారం ఉదయం 10.20 గంటలకు ఆత్కూరు నుండి బయలుదేరి 10.50 గంటలకు సూరంపల్లి సిపెట్ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు.  ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకు సిపెట్ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టు చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకూ జరిగే కార్యక్రమంలో స్వర్ణభారతి ట్రస్టులో శిక్షణ పొందే విద్యార్ధులకు ధృవపత్రాలు అందజేస్తారు. మంగళవారం డిశంబరు 29న ఉదయం 8.40 గంటలకు గౌ. ఉపరాష్ట్రపతి ఆత్కూరు నుండి బయలుదేరి ఉదయం 8.55 గంటలకు విజయవాడ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళతారని సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర తెలియజేసారు. ఈపర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు, ప్రొటోకాల్, తదితర అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.  ఈకార్యక్రమంలో అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) టి. సర్కారు, అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిహెచ్. లక్ష్మీపతి, ఇన్స్‌పెక్టర్ జనరల్ అధికారిణి యం. దేవి, డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనరు ఆఫ్ పోలీస్‌లు అంకయ్య, విజయపాల్, రంగాముని, వైద్య ఆరోగ్య అధికారి డా. మోతిబాబు, సి.యస్.ఓ. కె. శ్రీనివాస్, రహదారులు భవనాలు శాఖ అసిస్టెంట్ ఇంజినీరు నరేంద్రరెడ్డి, ఎ లక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీరు ఏ.వి. దుర్గాప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టరు ప్రొటోకాల్ యం. వాణి, గన్నవరం విమానాశ్రయం డైరెక్టరు జి.యం.యస్. రావు, తదితరులు పాల్గొన్నారు.