ఏయూ ఎన్‌ఎస్‌ఎస్‌కు రాష్ట్ర స్థాయి అవార్డులు..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-24 18:41:15
ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకంకు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. రాష్ట్ర స్థాయిలో అందించే అవార్డులలో మూడు విభాగాలో నాలుగు అవార్డులు లభించాయి.ఈ సందర్భంగా అవార్డులు సాధించిన వారికి ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అభినందించారు. గురువారం ఏయూ సెనేట్ మందిరంలో అవార్డులు సాధించిన వారిని అభినందించారు. ఉత్తమ పోగ్రాం కోఆర్డినేటర్‌గా డాక్టర్ ఎస్.హరనాథ్, ఉత్తమ పోగ్రాం అధికారుల విభాగంలో డాక్టర్ కె.మానిక్య కుమారి, వలంటీర్‌ల విభాగంలో సి.హెచ్ శివ శంకర్, కె.నిర్మల హైమలకు అవార్డులు లభించాయి. ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌ల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్కరినే ఎంపిక చేయగా ఈ అవార్డును ఏయూ పోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.హరనాథ్‌కు లభించింది. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర ఇటిఐ కేంద్రం సంచాలకులు డాక్టర్ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.