తీరప్రాంతం ఆదాయ వనరుగా మారాలి..
Ens Balu
1
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-24 18:43:34
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) అవగాహన ఒప్పందం చేసుకుంది. గురువారం సాయంత్రం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్‌కాయిస్ సంచాలకులు డాక్టర్ టి.శ్రీనివాస కుమార్‌లు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయ వనరుగా తీర ప్రాంతం నిలుస్తుందన్నారు. మత్స్యకారులకు ఉపయుక్తంగా పరిశోధనలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. విద్యార్థులను, పరిశోధకులను భాగం చేస్తూ నూతన పరిశోధనలు జరపాలని సూచించారు. సామాజిక ప్రయోజన, వాణిజ్య ఉపయుక్తంగా పరిశోధనలు జరపే దిశగా ఆంధ్రవిశ్వవిద్యాలయం పరంగా పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుందన్నారు.
ఇన్‌కాయిస్ సంచాలకులు డాక్టర్ టి.శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ కోస్టల్ మానిటరింగ్, పరిశోధన భాగస్వామ్యం జరిపే దిశగా ఆంధ్రవిశ్వవిద్యాలయం తగిన సహకారం అందించాలని సూచించారు. సంయుక్త భాగస్వామ్యంలో పరిశోధనలు బలోపేతం చేయడం, సమాజ ఉపయుక్తంగా పరిశోధనలు జరపడం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాస రావు,అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంటర రావు, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య ఆర్.శివ ప్రసాద్, ఆచార్య క్రిష్ణమంజరి పవార్, ఏయూ సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ బే ఆఫ్ బెంగాల్ గౌరవ సంచాలకులు ఆచార్య పి.రామారావు, ఏయూ పూర్వ రెక్టార్ ఆచార్య ఏ.రాజేంద్ర ప్రాసద్ తదితరులు పాల్గొన్నారు.