న్యాయబద్ధమైన సమస్యలు కమిషన్ ద్రుష్టికి తెండి..


Ens Balu
2
Tirupati
2020-12-24 18:56:20

న్యాయ బద్దమైన సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తుందని జాతీయ బి.సి. కమిషన్ గౌరవ సభ్యులు ఆచారి తల్లోజు పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లోని సెనేట్ హాల్ నందు జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు యూనివర్సిటీ లోని భోదన మరియు భోధనేతర సిబ్బంది, విద్యార్దులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హాజరైన జాతీయ బి.సి. కమిషన్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బి.సి. కమిషన్ కు రాజ్యాంగ బద్రత కల్పించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బి.సి. లకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నదని తెలిపారు. బి.సి. లకు అన్యాయం జరిగినప్పుడు కమిషన్ అండగా ఉంటుందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులతో నేడు ఎస్వి యూనివర్సిటీ కి రావడం జరిగిందన్నారు. బి.సి. విద్యార్దులకు ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం న్యాయం జరుగుతుందా అనే విషయాన్ని  పరిశీలిస్తామన్నారు. ఎస్వి యూనివర్సిటీ లో బి.సి. విద్యార్దుల సమస్యలను తెలుసుకోవడం కోసమే ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా కమిషన్ ద్రుష్టి కి తీసుకోని రావాలన్నారు. ఎస్వి యూనివర్సిటీ లో బి.సి ల సంక్షేమం కోసం ఒక సెల్ ఏర్పాటు చేయాలని  తెలిపారు. మారుమూల ప్రాంతాలలోని బి.సి. లకు కూడా కమిషన్ వున్నదనే  విషయాన్ని  తెలియజేయాలన్నారు. ఎస్వి యూనివర్సిటీ లో గల లోపాలు ఇతరితర విషయాలు గురించి నా ద్రుష్టి కి తీసుకొస్తే యూనివర్సిటీ వి.సి. ద్రుష్టి కి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికి అందాలన్నారు. యూనివర్సిటీ లోని అన్ని విభాగాలలో 27 శాతం బి.సి. లకు రేజేర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. దేశం లోని అన్ని యూనివర్సిటీ ల స్థితి గతులపై అద్వాయణం జరుగుతోందన్నారు.         శ్రీ వెంకటేశ్వర  యూనివర్సిటీ  రిజిస్ట్రార్  శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్వి యూనివర్సిటీ లో 565 సాంక్షన్  పోస్టులు ఉన్నాయని, బి.సి. కులానికి చెందిన 53 మంది అధ్యాపకులు ఉన్నారని అలాగే రెగ్యులర్ వి.సి. కుడా ఉన్నారని, ఎస్వి యూనివర్సిటీ లో రోస్టర్ పాయింట్ కవర్ అవుతూ ఉన్నాదని తెలిపారు. హిస్టరీ డిపార్టుమెంటు లో పి.జి. చేస్తున్న నారాయణ గౌడ్ మాట్లాడుతూ కమిషన్ గౌరవ సభ్యులు మా యూనివర్సిటీ కి రావడం చాల ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బి.సి. ల పక్ష పాతిగా ఉందని తెలిపారు. నాన్ టీచింగ్ లో అధ్యాపకులకు, విద్యార్దులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానన్నారు. బి. సి. ల సమస్యలను కొంత వరకు ఎస్వి యూనివర్సిటీ పరిష్కరిస్తూ ఉందని తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ విద్యార్ది డాక్టర్ పొత్తూరి శ్రీకాంత్ మాట్లాడుతూ అందరికి నడక నేర్పించి వ్యక్తి జాతీయ బి.సి. కమిషన్ గౌరవ సభ్యులు ఆచారి తల్లోజు అన్నారు. తిరుపతి పట్టణం ఒక సరస్వతి నిలయం అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న చోట ఎస్వి యూనివర్సిటీ ఉందని తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు.         ఈ కార్యక్రమంలో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఖుస్భు కొఠారి, శ్రీ వెంకటేశ్వరా  యూనివర్సిటీ  విద్యార్దులు, తదితరులు పాల్గొన్నారు.