నరేగా పనులు ఉపయుక్తంగా ఉండాలి..
Ens Balu
3
Tirupati
2020-12-24 19:00:19
నరేగా లో చేపట్టే పనులు పది కాలల పాటు ప్రజా ఉపయోగంలో వుండాలని పంచాయత్ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. గురువారం ఉదయం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం సావేరి సమావేశ మందిరంలో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా ఉప ముఖ్యమంత్రి , పంచాయితీరాజ్ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ నేను 27 సంవత్సరాలు సమితి అధ్యక్షులుగా పనిచేశానని ఇంత నిధులు, అభివృద్ధి, కుటుంబాలకు ఆర్థిక సహయం ఎప్పుడూ చూడలేదని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమలు చేస్తున్న విదానం అబివృద్ది నేడు చూస్తున్నానని అన్నారు. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన చెరువు ఆక్రమణలకు గురై, కాలువలు పూడిపోయాయని వాటిని దృష్టి పెట్టి నీరు నిల్వ ఉండే చర్యలు చేపట్టాలని కోరగా పంచాయితీరాజ్ శాఖ మంత్రి స్పందించి ఏప్రిల్ నుండి ప్రారంభించాలని ఇప్పుడు నీళ్ళు ఉన్నాయని అధికారులకు సూచించారు.
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ నరేగా పనులలో యంత్రాలు ఉపయోగించరాదని అలా చేస్తే చర్యలు తప్పవని నరేగా పూర్తిగా పేదలకు ఉపాధి కల్పన అని గుర్తించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గ్రామాలలో రూపురేఖలు మారుతున్న విషయం తెలిసిందేనని, నరేగా అనుసంధానంతో మెటీరియల్ కాంపొనెంట్ ఎక్కువ వాడితే పదికాలాల పాటు శాశ్వత భవనాలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, పాల కేంద్రాలు వంటివి చేపట్టి అనుకున్న మేరకు మార్చి 2021 కు పూర్తి కావాలని సూచించారు. తాలూకాలు వున్న సమయంలో పనులకోసం 100 కి.మీ. లు ప్రయాణించే వాళ్ళమని ఆ తర్వాత ఎన్.టీ.ఆర్ మండల వ్యవస్థతో దూరం తగ్గడం, నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో గ్రామాల్లోనే ప్రజలు తమ పథకాలు, పనులు పూర్తి చేసుకునే విధంగా సచివాలయాలు వచ్చాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా నరేగా నిధుల ఖర్చుతో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతుంటాయని, మనం మొదటి మూడు స్థానాలలో ఉండాలని కష్టపడితే మొదటి స్థానం రావచ్చని తెలిపారు. జల జీవన్ మిషన్ తో గ్రామాలకు త్రాగు నీరు కార్యక్రమం కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు.
నరేగా డైరెక్టర్ చినతాతయ్య, కమీషనర్ గిరిజా శంకర్ లు, నరేగా కౌన్సిల్ సభ్యులు విశ్వనాథ్ ఐదు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి చేపట్టాల్సిన అత్యవసర పనులను సూచించారు.
ఈ సమీక్షలో మహిళా విశ్వవిద్యాలయ విసి జమున యూనివర్సిటీ లో బయటి డ్రైనేజీ వల్ల ఇబ్బందులు ఉన్నాయని మంత్రికి విన్నవించగా తక్షణమే 1.5 కిమి డ్రైన్ వ్యవస్థ మార్పుకు మంత్రి ఆదేశాలు సంబంధిత అధికారుల కు ఆదేశాలిచ్చారు.
ఈ కార్యశాలలో ఐదు జిల్లాల పి.డి లు చంద్రశేఖర్, శివ ప్రసాద్, తిరుపతయ్య, వేణుగోపాల్ రావు, ఎ.పి.డి లు, సిబ్బంది పాల్గొన్నారు.