రాష్ట్రస్థాయి ఎన్ఎస్ఎస్ అవార్డు విఎస్ యు విద్యార్ధి..
Ens Balu
2
Nellore
2020-12-24 19:30:00
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో తృతీయ సంత్సర విద్యార్థి చుక్కల పార్థసారథి రాష్ట్ర స్థాయి ఉత్తమ జాతీయ సేవా పథకం (NSS) వాలంటీర్ అవార్డు కు ఎంపికయ్యాడు. సుమారు 2 లక్షల యాభైవేల మంది వాలంటీర్లు వున్న ఆంధ్ర రాష్ట్రంలో 9 మంది లో ఒకరుగా ఎంపిక అవ్వటం ఒక గొప్ప విషయం అని యూనివర్శిటీ ఉప కులపతి ఆచార్య ఆర్.సుదర్శన రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పార్థసారధిని అయన అభినందించారు. రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, నిబద్దతతో కష్టపడే వారి కష్టానికి గుర్తింపు ఉంటుందని.. అందుకు పార్థసారథి చక్కని నిదర్శనమన్నారు. కోవిడ్ వుధృతంగా ప్రబలుతున్న సమయం లో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టాడని అన్నారు. ఈ సందర్భముగా చుక్కల పార్థసారధిని రెక్టార్ ఆచార్య యం.చంద్రయ్య రిజిస్ట్రార్ డా.యల్ విజయ కృష్ణా రెడ్డి, NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం కృష్ణ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం పి కృష్ణారెడ్డి , పి. చంద్ర శేఖర్ రెడ్డిలు అభినందించారు.