కృష్ణాజిల్లాలో 3,33,136 మంది లబ్దిదారులు..
Ens Balu
3
Vijayawada
2020-12-24 19:46:40
నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కోసం కృష్ణాజిల్లాలో 3,33,136 మంది లబ్దిదారులను గుర్తించామని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ అన్నారు. కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం పాత్రికేయుల సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ కృష్ణౌజిల్లాలో శుక్రవారం వేడుకగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్లపట్టాలు కోసం 2 లక్షల 73 వేల 940 మంది లబ్దిదారులను గుర్తించామన్నారు. టిడ్కో లబ్దిదారులు 26 వేల 960 మంది, జియస్‌డబ్ల్యుయస్ లబ్దిదారులు 2192 మందిని గుర్తించామన్నారు. ఇళ్లపట్టాల స్ధలాలకోసం 6051.37 ఎ కరాల స్ధలాన్ని సేకరించామని, ఇందులో ప్రభుత్వ భూమి 1864.50 ఎ కరాలు, పట్టాభూమి 4186.87 ఎ కరాలు ఉందన్నారు. ప్రభుత్వ భూమిలో 897, పట్టాభూముల్లో 610 లేఅవుట్లను సిద్ధం చేశామన్నారు.
ఇబ్రహీంపట్నంలో జరిగే కార్యక్రమంలో మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, తాను, జాయింట్ కలెక్టరు పాల్గొనడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఒక పెద్ద వేడుకగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.అర్హత ఉన్న లబ్దిదారులందరికీ ఇళ్లు, ఇళ్ల స్ధలాలు మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆదిశలో అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈవిలేఖరుల సమావేశంలో జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత, సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర, డిఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.