చెత్త వేసినందుకు మరోలా అనుకోవద్దు..


Ens Balu
2
Vijayawada
2020-12-24 19:48:43

క్రిష్ణాజిల్లా ఉయ్యూరులోని ఆంధ్రాబ్యాంక్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య సిబ్బంది రుణాలు ఇవ్వలేదన్న కోపంతో చెత్తవేయడంపట్ల కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరు కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరు ఇంతియాజ్ బ్యాంకు అధికారులతో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ వై.యస్.ఆర్. చేయూత, జగనన్నతోడు పధకాల క్రింద ఉయ్యూరు ఆంధ్రాబ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారని కలెక్టరు చెప్పారు. ఈచర్యపట్ల తాను తీవ్రంగా బాధపడుతున్నానని బ్యాంకు అధికారులకు కలెక్టరు చెప్పారు. జిల్లాలో బ్యాంకులు, అధికారులు కలిసి ప్రజలకు మేలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని చెప్పారు. జిల్లాలో రుణాలు కల్పించడంలో బ్యాంకులు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కలెక్టరు కోరారు. బ్యాంకుల సమన్వయకర్తలు, బ్యాంకు మేనేజర్లు, బ్యాంకుల సిబ్బంది అందరూ పేదలకు రుణాలు ఇవ్వడంలో తమ వంతు తోడ్పాటు అందించాలని కలెక్టరు కోరారు. ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం కావని కలెక్టరు బ్యాంకర్లకు చెప్పారు.