తక్షణమే చెత్తను అక్కడి నుంచి తరలించండి..
Ens Balu
2
Gajuwaka
2020-12-24 20:11:26
ఐలా ప్రాంతంలో గృహ వినియోగదారుల నుంచి సేకరించిన చెత్తను అదే ప్రాంతంలో నిల్వ ఉంచడం వలన రోగాలు ప్రభలే అవకాశం వుందని జివిఎంసి కమిషనర్ పేర్కొన్నారు. గురువారం గాజువాక పారిశ్రామికవాడలో ఐలా కమిషనర్ మరియు బోర్డు సభ్యులు ఇచ్చిన వినతి మేరకు ఆమె అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, చెత్త నిల్వల వలన దుర్వాసనతోనతోపాటు మంటలు ఏర్పడి కాలుష్యం వెదజల్లే అవకాశం ఉన్నందన్నారు. తక్షణమే సేకరించిన చెత్తను క్లోజ్డ్ కంపోస్ట్ వాహనం ద్వారా కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించాలని ఐలా కమిషనర్ కు సూచించారు. వడ్లపూడి ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్లు అభివృద్ధి చేసేందుకు తగు అంచనాలను సమర్పించాలని ఐదవ జోన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐలా బోర్డు సభ్యులు చేసిన ప్రతిపాదనలు పరిశీలించి, తగు చర్యలు చేపడతామని కమిషనర్ వారికి తెలియజేశారు. ఈ పర్యటనలో నీటి సరఫరా విభాగపు పర్యవేక్షక ఇంజినీరు కె. వేణుగోపాల్, ఐదవ జోన్ కమిషనర్ శ్రీధర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, కార్యనిర్వాహక ఇంజినీరు, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఐలా కమిషనర్, ఐలా బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.