Dr YSR కి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు..


Ens Balu
3
Idupulapaya
2020-12-24 20:27:42

 డా.వైఎస్సార్ కడప జిల్లాలో మూడురోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు గురువారం ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు చేరుకొని  పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రార్ధనలు చేశారు.  ముఖ్యమంత్రితో పాటు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ భాష, జిల్లా ఇన్చార్జి మంత్రి  ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంఎల్సీ జకియా ఖానం, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు ,మాజీ డి సి ఎం ఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, వై ఎస్ ఆర్ సీపి రాష్ట్ర కార్యదర్శి చిదంబర్ రెడ్డి,ఆసీఫ్ అలీఖాన్, గుమ్మా అమరనాధ రెడ్డి  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .  జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, జాయింట్ కలెక్టరు సి.ఎం. సాయికాంత్ వర్మ, ఓఎస్డిఅనిల్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.