కోవిడ్ వేక్సినేషన్ కు సిద్ధం కావాలి..


Ens Balu
3
జివిఎంసీ
2020-12-24 20:39:54

జివిఎంసీ పరిధిలో చేపట్టబోయే కోవిడ్-19 వాక్సిన్ పంపిణీ అధికారులు సిబ్బంది సన్నద్ధం కావాలని  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు.  గురువారం, జివిఎంసి సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో డి.ఎం.ఓ.హెచ్ సూర్యనారాయణతో కలసి వివిధ శాఖల ప్రతినిధులకు అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా  కమిషనర్ మాట్లాడుతూ వాక్సిన్ ముఖ్యంగా మూడు విధాలుగా విభజించి ఇస్తారన్నారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్ల కు, రెండవ దశలో పారిశుద్ధ్య కార్మీకులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు శాఖలకు, మూడవ దశలో 50 సంవత్సరాలు నిండిన వారికి, 50 సంవత్సరములు లోపుల ఉన్న వ్యక్తులకు బి.పి., షుగర్ లేదా దీర్ఘకాలపు వ్యాధి ఉన్న వారికి ఇస్తారని అందుకు మీ అందరి సహకారం అవసరమని తెలిపారు. డి.ఎం.ఓ.హెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశం నుండి పోలియో వ్యాధిని లేకుండా చేసి అలాగే ఈ కోవిడ్-19 భారతదేశం నుండి పారదోరాలని, అందుకు గాను వాక్సిన్ వేసేందుకు అనువుగా ఉన్న మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, కమ్మ్యూనిటీ హాలులు మొదలైనవి గుర్తించి, మూడు రూములు ఉండే విధంగా మొదటి రూమ్ వ్యక్తీ యొక్క అధార్ డాటా తనిఖీ, రెండవ రూములో వాక్సిన్ ఇవ్వడం, మూడవ రూములో 30 నిముషాల పాటు ఆరోగ్య పరిశీలన చేసి పంపించాలని అన్నారు. జివిఎంసి సి.ఎం.ఓ.హెచ్. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ కోవిడ్ – 19 వాక్సిన్ కు పోలీసు, రైల్వే, సోషల్ వెల్ఫేర్, మీడియా సెల్, డిఫెన్సు, డి.ఇ.ఓ., లేబర్ & ఎంప్లాయిమెంట్, అర్బన్ డిపార్ట్మెంట్ మొదలైన శాఖల సహకారం అవసరమని, ముఖ్యంగా కోవిడ్ వాక్సిన్ వేసినప్పుడు రద్దీ లేకుండా చూడాలని, అందుకు ఎన్.ఎస్.ఎస్, ఎన్.వై.కె.ఎస్ మరియు ఏ.ఎన్.ఎం.లు ఎక్ష్-సర్వీస్ మెన్స్, ఎస్.హెచ్.జి. గ్రూప్స్, హోమ్ గార్డ్స్, తదితరుల సహాయ సహాకారం తీసుకోవాలన్నారు.  ఈ సమావేశంలో డి.ఎం.ఓ.హెచ్ సూర్యనారాయణ, డి.ఐ.ఓ. డా. జీవన్ రాణి, డబ్ల్యూ.హెచ్.ఓ. డా. భవాని, యు.ఎన్.డి.పి. కమలాకర్, యు.ఎన్.ఐ.డబ్ల్యూ. డా. విక్రం, సి.పి.ఎం.ఓ.ఎన్.ఓ.హెచ్.ఎం. వెంకట రమణ, ఏ.సి.ఎం.డి. లక్ష్మణ రావు, రెండవ పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె. వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.