స్వచ్ఛ సర్వేక్షణ్ లో మంచి ర్యాంకు రావాలి..


Ens Balu
2
జివీఎంసీ
2020-12-24 21:15:05

స్వచ్ఛ సర్వేక్షణ్ క్రింద జరిగే వివిధ నగరాల మధ్య పోటీలలో ఉన్నత స్థానాన్ని విశాఖ నగరం సాధించడానికి తోడ్పాటు అందించాలని జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన నగర పరిధిలో గల ఆర్.డబ్ల్యూ.ఎ. సమాఖ్య సభ్యులను కోరారు. వర్చువల్ సమావేశ పద్దతిలో ఆమె, సభ్యులతో చర్చిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్–2020లో గుర్తించిన లోపాలను సరిదిద్ది 2021 సంవత్సరంలో ఉత్తమ ర్యాంకు సాధించడానికిగాను ఆర్.డబ్ల్యూ.ఎ. సంఘాలు సహకారంతో జివిఎంసి ప్రయత్నించాలని ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణ క్రింద శతశాతం మార్కులు సాధించాలంటే ఆర్.డబ్ల్యూ.ఎ.పాత్ర ఎంతైనా అవసరమని, అధికారులకు సూచించారు. స్వచ్చ సర్వేక్షణ్ ప్రధాన సూచికలైన గృహాల నుండి చెత్తను వేరు చేసి తడి–పొడి చెత్తగా పారిశుద్ధ్య కార్మీకులకు అందించటంలో ఇంకా పురోగతిని సాధించాలని, అందుకు గాను ప్రజలకు అవగాహన కార్యక్రమాలు సంఘ సభ్యులు ఆయా ప్రాంతాల పరిధిలో నిర్వహించాలని కోరారు. కొంతమంది సభ్యులు కమిషనర్ తో మాట్లాడుతూ మేడపైన గార్డెన్ పెంపకంకి తోడ్పాటు, కాలనీ ప్రాంతాలలో సుందరీ కరణ మొదలగు కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్ధిక సహాయం అందించాలని కమిషనర్ ను కోరారు. మరి కొంతమంది సభ్యులు జోనల్ స్థాయి అధికారులు కాలనీలో సందర్శించే నిమిత్తం షెడ్యూలు తయారుచేసి ఆర్.డబ్ల్యూ.ఎ. సంఘాల ప్రతినిధులకు తెలిపితే అధికారులతో పాటు సభ్యులు కూడా కాలనీ పర్యటనలో పాల్గొంటారని సూచించారు. దీనివలనసమస్యలు కొన్నింటిని అక్కడకక్కడే పరిష్కారమై ప్రజల వద్ద నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ సూచనలకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ వర్చువల్ సమావేశంలో అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఆర్.డబ్ల్యూ.ఎ. ఫెడరేషణ్ సభ్యులు ప్రసంగించి వారి సూచనలు తెలిపారు.