ఎపిజెన్కో ఎండిని పరామర్శించిన ఏపీ సి.ఎస్..
Ens Balu
2
Tirupati
2020-12-25 11:42:27
శ్రీవారి దర్శనార్థం అలిపిరి కాలినడకన వెళుతున్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఎపి జెన్ కో ఎండి . శ్రీధర్ గురువారం స్విమ్స్ నందు వెంటనే చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎపి కొత్త సి.ఎస్. ఆదిత్య నాద్ దాస్, ఎస్.ఎస్. రావత్ సి.ఎం.ఓ, కార్తికేయ మిశ్రా , సత్యనారాయణ ఐ ఆర్ ఎస్ , నేటి ఉదయం పరామర్శించిన వారిలో వున్నారు. స్విమ్స్ చేరుకున్న వీరికి స్విమ్స్ డైరెక్టర్ డా. వెంగమ్మ, మెడికల్ సూపరినెంట్ డా. రామ్, ఆర్డీఓ కనక నరసా రెడ్డి స్వాగతం పలుకగా, కార్డియాలజీ ఐ.సి.యు.నందు పరామర్శ సమయంలో సి. ఎం. డి. వారికి చికిత్స అందించిన కార్డియాలజీ హెచ్. ఓ.డి. డా.రాజశేఖర్ ఆరోగ్యం గా వున్నారని సకాలంలో స్టంట్ వేశామని తెలిపారు. వీరి పర్యటనలో ఆర్.ఎం.ఓ. డా.కోటిరెడ్డి, ఎ డి రాజశేఖర్ , అధికారులు వున్నారు. త్వరగా అత్యవసర చికిత్స అందించినందులకు డైరెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన కొత్త సి.ఎస్.