దేవుని క్రుపతో కరోనా వైరస్ తరలిపోవాలి..


Ens Balu
2
Rajahmundry
2020-12-25 15:14:31

రాజమహేంద్రవరం స్థానిక లాలాచెరువు జంక్షన్ వద్ద హోసన్నా చర్చి లో రెవరెండ్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. క్రిస్ మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ,  వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాన్ని భరత్ రామ్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, క్రిస్ మస్ వేడుకలు సాక్షిగా ప్రపంచం నుంచి కరోనా వైరస్ తరలిపోయేవిధంగా జీసస్ క్రైస్ట్ దీవించాలని కోరుకున్నానని చెప్పారు. ప్రభువు నిర్ధేశించిన మార్గంలో నడవడం ద్వారా స్వస్తత చేకూరుతుందన్న ఎంపీ ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం  లాలాచెరువు జంక్షన్ సమీపంలో మరనాత మహిమ మందిరాన్ని దర్శించుకుని ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రైజ్ ద లార్డ్ అంటూ క్రిస్మస్ చర్చిలో సహవాసులను ఉత్సాహపరిచారు.  ఆధునిక విధానంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఎంపీ వివరించారు.