సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం..
Ens Balu
1
Kurupam
2020-12-25 18:10:29
రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ళూ, ఇళ్ల పట్టాలను అందించడం సరికొత్త చరిత్ర అని ఉపముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఇది సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని అభిప్రాయపడ్డారు. కురుపాం నియోజకవర్గం కురుపాంలో శుక్రవారం ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, సబ్ కలెక్టర్ విధేఖర్ జ్యోతి.ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ళ పట్టాలు, 70 వేల ఎకరలాలో,17 వేల కాలనీలు ఏర్పాటుచేసి 30 లక్షల ఇళ్ళ పట్టాలు అందించే ఘనత మన గౌరవ ముఖ్య మంత్రి జగనన్నకే దక్కింది అన్నారు. నాకు ఓటు వేయక పోయినా ఆర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలనే ముఖ్య ఉదేశ్యంతో వొలెంటిర్ వ్యవస్థ ఏర్పాటు చేశారని, ప్రభుత్వ అభివృధి సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు ఉదయాన్నే తలుపుకొట్టి అందించే ఘనత మన గౌరవ ముఖ్య మంత్రి వర్యులది అన్నారు. పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి అందజేయాలన్నదే ముఖ్య మంత్రి ప్రధాన లక్ష్యం అన్నారు.
రాష్ట్రంలో 13 వేల గ్రామాలు ఉండగా 17 వేల కాలనీల నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాస్తవంగా ఇళ్ళ పట్టాలు ఉగాది నాటికే అందజేయాల్సి ఉందని కానీ ఆలస్యం అవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులే కారణమన్నారు. గౌరవ ముఖ్య మంత్రి వెనుకడుగు వేయకుండా పేదవాడికి ఇచ్చిన ప్రతి హామీ అందిస్తూ ముందుకు వెళుతున్నారని అన్నారు. పథకాలలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారని, అమ్మవడి, మహిళలకు చేయూత, వై.ఎస్.ఆర్.ఆశ్రా, వడ్డీలేని రుణాలు అంతే కాకుండా బి.సి.కార్పొరేషన్, మార్కెట్ యార్డ్ పదవులలో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించారు అన్నారు. రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు రద్దు చేసిన ఘనత గౌరవ ముఖ్య మంత్రి వర్యులకే దక్కిందన్నారు. కరోనా తో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిన ఎ పథకం ఆపకుండా కొనసాగించే ఘనత గౌరవ ముఖ్య మంత్రి కి దక్కిందన్నారు. అలాగే జనవరి 9 న రెండవ విడత అమ్మవడి కి సంబంధించి తల్లుల ఖాతాలో జమచేయడం జరుగుతుంది అన్నారు. అలాగే రాష్ట్రంలో అందరు జిల్లా కలెక్టర్లు మారినా విజయనగరం జిల్లా కలెక్టర్ మారక పోవడానికి ప్రధాన కారణం వారి పనితీరుకు నిదర్శనం అన్నారు, జిల్లాకు 16 జాతీయ పురస్కారం అవార్డులు రావడం వారు చేస్తున్న కార్యక్రమాలే అని కొనియాడారు.
ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టం..
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంత మంచి అవకాశం దొరకడం చాలా ఆనందాన్నీ ఇస్తుంది అన్నారు. జిల్లా కలెక్టర్ గా గత ప్రభుత్వంలో వచ్చినప్పటికీ ప్రభుత్వాలు మారినా విజయనగరం జిల్లా కలెక్టర్ కొనసాగడం ఆందంగా వుంది అన్నారు. అందుకు ప్రధాన కారణం మంత్రి వర్యులు, జిల్లా ప్రజా ప్రతినిధులు కారణం అన్నారు. గౌరవ ముఖ్య మంత్రి వర్యుల ప్రోత్సాహంతో కొన సాగుచున్నను అన్నారు. లేఖ పోతే ఇంత గొప్ప అవకాశాన్ని కోల్పోయేవాడిని అన్నారు, జిల్లాలో 98 వేల మంది నిరుపేద కుటుంబాలకి ఇచే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు. అలాగే ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే యువతకు ఉద్యోగం కల్పించి వేలాది కుటుంబాలలో జ్యోతిని నింపడం జరిగిందన్నారు. అందులో భాగంగా 718 సచివాలయాలలో 15 వేలమందికి ఉద్యోగం కల్పించడం లో అవకాశం రావడంతో ఏంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖర్, హౌసింగ్ పి.డి, రెవెన్యూ, హౌసింగ్ ఆధికారులు సిబ్బంది లబ్ధి దారులు తదితరులు పాల్గొన్నారు.