చరిత్రలో నిలిచేలా ఇళ్ల పట్టాలు పంపిణీ..


Ens Balu
3
Srikakulam
2020-12-25 19:01:32

రాష్ట్ర చరిత్రలో నిలిచేలా మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, పాల ఉత్పత్తి అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి డా, సిదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణ పురం లే అవుట్ వద్ద నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లో భాగంగా మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్దాల కాలం పాటు పాలించిన ప్రభుత్వాలు 45 లక్షలు ఇల్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు, పేదవాడి గుండె చప్పుడు ముఖ్యమంత్రి తెలుసుకొనవలెనే ఇది సాధ్యపడింది అన్నారు. ముఖ్యమంత్రి సంకల్పం చరిత్రలోనీ నిలిచిపోతుందన్నారు. వైయస్సార్ జగనన్న కాలనీలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి శాశ్వత నివాసానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడతామన్నారు.  జిల్లాలో మొదటి దశలో 17 వేల గ్రామాలు, రెండో దశలో 17వేల గ్రామాలు  నిర్మిస్తామన్నారు. పలాస నియోజకవర్గానికి సంబంధించి 15వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3016 మందికి ఇళ్ల పట్టాలు, 2017 మంది సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణం చేయుటకు, 972 మందికి టిడ్కో హౌసింగ్ ద్వారా ఇల్లు మంజూరు చేస్తామన్నారు.లేఅవుట్లు, టిడ్ కో హౌసింగ్ జాబితాలు పేరు లేని వారు ఆందోళన చెందనవసరం లేదని గ్రామ సచివాలయంలో నమోదు చేసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు ఎన్నాళ్ళనుంచో వేచి చూస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ దశ లో ఉందని పూర్తి చేసి పట్టణ ప్రజలకు బహుమతిగా అందిస్తానని వెల్లడించారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం కింద ప్రీతి గిరిజనుడికి సాగు హక్కు కల్పించి భూమి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలోనే ఆఫ్ షోర్ రిజర్వాయర్ టెండర్ ప్రక్రియ పూర్తి కానుందని,  రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని అన్నారు.  భూసేకరణ కు భూమి ఇచ్చిన రైతుకు సకాలంలో పరిహారం ఇచ్చేందుకు నిరంతరం శ్రమించి, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టిన యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం పలువురు మహిళలకు మంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముంద ప్రాజెక్టు విలువ సుమారు రూ.4,554 లక్షల వ్యయంతో 2,530మంది లబ్ధిదారులకు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో భాగంగా వైయస్సార్ జగన్ అన్న కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ గతంలో పట్టాలు ఇచ్చి ఇల్లు స్థలం చూపించేవారు కాదని, ప్రస్తుతం నిర్మించిన లే అవుట్ లలో లబ్ధిదారునికి స్థలం చూపించి పట్టా పంపిణీ చేపడుతున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయం వద్ద ప్రదర్శించడం జరుగుతుందని పారదర్శకతకు ఇదేంది నిదర్శనమని అన్నారు. ప్రైవేట్ లేవుట్ లకు మించి సుందర లే అవుట్ లుగా తీర్చిదిద్దా మన్నారు. పట్టాలు పంపిణీ కాకుండా ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన సామాగ్రిని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. లే అవుట్ ల వద్ద అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా,కిల్లి కృపారాణి, పలాస వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ పి.సతీష్ ,జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సబ్ కలెక్టర్ సూరజ్ గనూర్ ధనుంజయ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ నారాయణ, తాసిల్దార్ మధుసూదన్ రావు, తదితరులు పాల్గొన్నారు.