వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి..
Ens Balu
2
Tirumala
2020-12-25 19:07:40
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ముందుగా ప్రకటించిన సమయం కంటే ఒకటిన్నర గంట ముందుగా సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించడంపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ విఐపిలు పూర్తి సహకారం అందించడంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ సర్వదర్శనాలను నిర్ణీత సమయం కంటే ముందుగా ప్రారంభించినట్టు తెలిపారు. మొదటిసారిగా దాతలకు, వర్చువల్ ఆర్జిత సేవల భక్తులకు కూడా దర్శనం కల్పించామని, ఆఫ్‌లైన్‌లో 1000 శ్రీవాణి టికెట్లు కేటాయించామని చెప్పారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టిటిడికి పూర్తిగా సహకరించి ప్రశాంతంగా శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్టు తెలిపారు.