పేకల సొంతింటి కల ప్రభుత్వం తీర్చింది..
Ens Balu
4
Rudravaram
2020-12-25 19:59:03
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసి వీటి ద్వారా సామాన్యుడి స్వప్నాన్ని నిజం చేసిందని కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాఫిజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, డా.సుధాకర్ లు పేర్కొన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం ప్రారంభోత్సవం లో భాగంగా శుక్రవారం కర్నూలు మండలం రుద్రవరం గ్రామం వద్ద కర్నూలు నగర పాలక పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్ ఇంటి స్థలాలకు పట్టాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్బంగా కర్నూలు నగర పాలక పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, డి.ఆర్.ఓ పుల్లయ్య, అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ హాజరై పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ, తొలివిడత పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలతో కూడిన జగనన్న కాలనీలను నిర్మించడం ఎంతో సంతోకరమన్నారు. పేదల మోములో చిరునవ్వును చూడటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు నివేశన స్థలాల కేటాయింపులో మొదటి నుంచి జిల్లా అధికార యంత్రాంగం ఎంతో శ్రమించిందని వారి కృషి అభినందనీయమన్నారు. కుట్రలు, కుత్రంతాలతో కొందరు ప్రతిపక్ష నాయకులు నిరుపేదలు అభివృద్ధి చూసి ఓర్వలేక వారికి ఇంటి పట్టాలను పంపిణీ చేయనేయకుండా ఉండేందుకు కోర్టుల్లో పిల్ వేసి రాక్షస ఆనందం పొందారని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే డా.సుధాకర్ మాట్లాడుతూ, పట్టాల పంపిణీకి కేవలం అర్హులకు మాత్రమే అధికారులు పెద్దపీట వేశారని..పూర్తి పారదర్శకంగా కేటాయింపు ప్రక్రియ జరిగిందన్నారు. భవిష్యత్ లో జగనన్న కాలనీలు ఓ మినీ మునిసిపాలిటీలుగా మారుతున్నాయని వెల్లడించారు. అంతకుముందు కాకినాడ నుంచి లైవ్ లో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని వినిపించారు. కార్యక్రమంలో మునిసిపల్ ఎస్ఈ సురేంద్రబాబు, డిఈ రాధాకృష్ణ, నగర పాలక ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.