కోవిడ్ నుంచి కోలుకున్న 295 మంది డిశ్చార్జ్..


Ens Balu
4
Srikakulam
2020-08-10 18:43:21

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నుంచి  కోలుకుంటూ ఆనందంగా ఇంటి బాటపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో కోలుకుని ఆరోగ్యంగా ఉన్న 29 5 మందిని ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాలు, హోమ్ ఐసోలేషన్ ల నుండి డిశ్చార్జు చేసారు. డిశ్చార్జు అవుతూ ఇంటికి వెళుతున్న వారు ఆనందంతో ఉన్నారు. ఆసుప త్రుల్లో మంచి సౌకర్యాలు అందుబాటులో ఉంచారని, వైద్య సేవలు అందుతున్నాయని వారు పేర్కొంటున్నారు. సకాలంలో లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం, ఆలస్యం చేయకుండా వెంటనే ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చేర్చడం జరుగుతోంది. మానసికి ప్రశాంతతకు పెద్ద పీఠ వేస్తూ చికిత్స అందించడంతోపాటు పౌష్టికాహారం అందించడం తదితర చర్యల వలన త్వరగా కోలుకునే పరిస్ధితి ఏర్పడింది. ఇంటింటి సర్వే చేయడమే కాకుండా ప్రతి సచివాలయాల్లో కంట్రోల్ రూమ్ లు  ఏర్పాటు చేసి కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తంచి వెంటనే ఆసుపత్రిలో చేర్పంచే చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికి సాధారణ జ్వరంగా భావించి ఇంటి వద్ద ఉండటం లేదా కోవిడ్ వివక్షకు గురి అవుతామని భావించి సమాచారం ఇచ్చే పరిస్ధితి ఉండేది కాదు. తద్వారా చివరి క్షణాల్లో ఆసుపత్రికి రావడం పూర్తి స్ధాయిలో చికిత్స అందించే స్ధితి లేకపోవడంతో మరణాలు సంభవిస్తుండటాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ జె నివాస్ సచివాలయాల్లో రేయింబవళ్ళు పనిచేసే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి ఎటువంటి ఆలస్యం జరగకుండా కేసుల వివరాలు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు. ఇటువంటి ఏర్పాట్ల వలన ప్రాథమిక స్దాయిలోనే చికిత్స అందించడం వలన కోలుకుంటున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో మొత్తం 11,441 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాగా అందులో 6,769 మంది కోలుకుని ఇళ్ళకు చేరారు. ప్రస్తుతం జిల్లాలో చికిత్స పొందుతున్న 4,548 మందిలో 2,679 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 1165 మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉన్నారు. కేవలం 704 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రుల్లో 1854 బెడ్లు ఉన్న సంగతి విదితమే. కోవిడ్ లక్షణాలు ఉంటూ అంబులెన్సు అవసరం అయ్యే వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లకు సమాచారం అందించవచ్చును. వారితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ కు గాని,  జిల్లా కంట్రోల్ రూమ్ కు కూడా 08942 240605, 08942 240607 ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేయవచ్చును. కరోనా లక్షణాలు ఉంటే తెలియజేయాలని దండోరా ద్వారా, ఆటో ప్రచారం ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తున్నారు.
సిఫార్సు