కొవిడ్ వారియర్స్‌కు ఘన సత్కారం..
Ens Balu
2
Visakhapatnam
2020-12-26 13:47:19
కొవిడ్-19లో ప్రజలకు మెరుగైన సేవలందించినం ఉత్తరాంధ్ర కొవిడ్ ప్రత్యేక అధికారి,ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్‌ను శనివారం నేవల్ డాక్‌యార్డ్ (కేటిబి) ఉద్యోగుల సంఘం ఎఎంసి కళాశాలలో ఘనంగా సత్కరించింది. సుధాకర్ విశేష సేవలందించారని సంఘం నేతలంతా కొనియాడారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, అందరి సహకారంతోనే కొవిడ్ నుంచి మెరుగ్గా బయటపడగలిగామని అన్నారు. ప్రజలు అందించిన సహకారంతో పాటు,ప్రభుత్వం కూడా సకాలంలో అన్ని చర్యలు చేపట్టిందని, దీంతో పాటు మీడియా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ సమన్వయంగా పనిచేసిందన్నారు. ఉత్తరాంధ్రలో కొవిడ్‌ను సకాలంలో అదుపుచేయగలిగామన్నారు. ఇప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సుధాకర్ సూచించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులకు మెరుగైన సేవలందించి వారికి అండగా నిలిచినందుకు రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.ఆనందరావును సంఘం నేతలంతా ఘనంగా సత్కరించారు. ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తమ అసోసియేషన్ సభ్యలు సంక్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. కొవిడ్ వారియర్స్‌ను సత్కరించుకోవటం తమ బాధ్యతగా బావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బత్తుల చిరంజీవి,కార్యదర్శి భాస్కరరావు,ఇతర ప్రతినిధులు శ్రీనువాస్,గవర సోమశేఖర్,సన్యాసిరావు,బంగిన శ్రీనువాస్,చిన్నారావు,నాగార్జున,తేజ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.