లిక్కర్ దొంగ చేతకాకే తోక ముడిచాడు..


Ens Balu
1
Visakhapatnam
2020-12-26 21:18:58

లిక్కర్ మాఫియా దొంగ, భూ అక్రమార్కుడు వెలగపూడి రామకృష్ణబాబుకి దమ్ము ధైర్యం లేక నిన్న సవాల్ విసిరిన దానికి సమాధానం చెప్పలేక  బాబా గుడికి రాలే కపోయారని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల గారు ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈస్ట్ పాయింట్ కాలనీ శిరిడి సాయిబాబా దేవాలయం వద్ద పెద్దఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకొని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిని విమర్శించే స్థాయి లిక్కర్ మాఫియా డ్రగ్స్ వ్యాపారైన టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కు లేదన్నారు.  చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఈ విధమైన కారుకూతలు కూస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా దమ్ముంటే ఈ రోజే శిరిడి సాయిబాబా దేవాలయానికి వచ్చి ఉండేవారని అటువంటి ధైర్యం చేయలేనపుడు సవాల్ విసరడం దేనికని ప్రశ్నించారు. దైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల్లో నీకెంత విలువుందో తెలుస్తుందన్నారు. ఇప్పటికై అవ్వాకులు చెవ్వాకులు పేలకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా కార్పొరేటర్ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.