అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు..


Ens Balu
3
Padmanabham
2020-12-26 21:25:55

అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం  పద్మనాభం మండలం  అయినాడ,  బి.ఆర్. తాళ్లవలస గ్రామాలలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమం క్రింద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తీర్చాలని వారికి అవసరమైన ఏమిటో తెలుసుకున్నారని చెప్పారు.  అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి పక్కా ఇల్లు  అందజేయాలని ముఖ్యమంత్రి   సంకల్పించి పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.   ఇల్లు లేని పేద వారిని గుర్తించి కుటుంబంలో మహిళ పేరున భూమి పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు.  అయినాడ గ్రామంలో తమ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలో  రూ.5 లక్షల సంక్షేమ కార్యక్రమాలు రూ 2 లక్షల 68 అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం రూ. 7 లక్షల 75 చేపట్టామన్నారు.          అనంతరం బి.ఆర్ తాళ్లవలస గ్రామం లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న 999 కుటుంబాలకు ప్రభుత్వ  అభివృద్థి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు రూ. 4 కోట్ల 75 లక్షలు లబ్ది చేకూరిందని తెలిపారు.  పాండ్రంగి వద్ద నిర్మించే బ్రిడ్జికి రూ 14 కోట్లు, రేవిడి వెంకటాపురం రోడ్డు కి రూ.16 కోట్ల,  రెడ్డిపల్లి పద్మనాభం రోడ్డు రూ. 10 కోట్లు, అనంత పద్మనాభ స్వామి కొండరోడ్డుకు రూ 5 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మండల కేంద్రమైన పద్మనాభం లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు.            జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ, బి.ఆర్. తాళ్లవలస గ్రామంలో 92 మందికి మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందిస్తున్నామన్నారు.  పట్టాలు ఇచ్చిన స్థలాల్లో రూ.లక్షా ఎనభై వేల తో ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఇంటి నిర్మాణం కోసం మంజూరు పత్రం, ఒక సంవత్సరంలో గా నిర్మాణం చేసి ఇస్తారని కరెంట్, రోడ్లు, అంగనవాడి, త్రాగునీరు, డ్రైనేజీ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో లక్ష 16 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి అందిస్తున్నామని, జీవీఎంసీ పరిధిలో  లక్షా 75 వేల పట్టాలు మంజూరు చేసినప్పటికీ  కోర్టు ఉత్తర్వుల మూలంగా అందించలేక పోతున్నట్లు తెలిపారు. బుడ్డి వలస గ్రామం లో కొత్తగా సచివాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలియజేశారు. గృహాలు మంజూరు నిరంతర ప్రక్రియని చెప్పారు.         లబ్ధిదారులు రంగాల ఉగాది,  మందల ఆశ మాట్లాడుతూ ఇంత త్వరలో సొంత ఇల్లు సాకారం అవుతుందని తాము ఎప్పుడూ ఊహించలేదన్నారు. తమకు ఇంటి స్థలాన్ని అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారులకు మంత్రి గారికి ఎప్పటికి రుణపడి ఉంటామని ఆనందంతో చెప్పారు. మరో లబ్దిదారు స్వర్ణలత వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఫీజు రియంబర్సుమెంటు పొందామని ఇప్పుడు జగనన్న సి.యం.గా వచ్చినప్పుడు ఇంటి స్థలం పొందానన్నారు జగనన్న పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టి ఆదుకొంటున్నారు.  ముఖ్యమంత్రిగా చిరకాలం వుండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.పెంచల కిషోర్,  తాహసీల్దారు శ్రీనివాసరావు ఎంపీడీవో చిట్టి రాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు.