విజయవాడలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం..


Ens Balu
2
Vijayawada
2020-12-27 21:13:00

రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న భారత దేశ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడుకి పలువురు ప్రజా ప్రతినిధులు , అధికారులు ఆదివారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలో  స్వాగతం పలికిన వారిలో- దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, జిఎడి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, నగర పోలీస్ కమీషనర్ బి .శ్రీనివాసులు, విఎంసి కమీషనర్ వి ప్రసన్న వెంకటేష్ , సబ్ కలెక్టర్ హెచ్ ఎమ్ ధ్యానచంద్ , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్  జి.మధుసూదన్ , విమానాశ్రయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు .  ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు ఆత్కురు లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కి చేరుకొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  పోలీస్ గౌరవ వందవందనాన్ని  స్వీకరించారు. రాత్రి ఎస్ బి టి నందు బస చేస్తారు. రెండవ రోజైన సోమవారం ఉదయం సీపెట్ (ప్లాస్టిక్ అనుబంధ పరిశ్రమ ) శిక్షణ , ఉత్పత్తి  సంస్థ , సూరంపల్లి ను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖీ లో పాల్గొంటారు , సాయంత్రం స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని , శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందచేస్తారు . మూడవ రోజైన మంగళవారం రాష్ట్రములోని మూడు రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఉప రాష్ట్రపతి  బెంగుళూరు బయలుదేరి వెళతారు.