వినూతన్నంగా తేంక్యూ సీఎం జగనన్న..


Ens Balu
3
Anantapur
2020-12-27 21:27:05

తమ సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులకు కొడిమి లేఔట్‌లో ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్ల వద్ద ‘థ్యాంక్యూ జగనన్న’ అని అక్షరాలుగా నిలబడి ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్‌ తమను ఓ ఇంటి వాళ్లుగా చేశారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, ఇంత మంచి ప్రాంతంలో ఇంటి స్థలాలను అందించినందుకు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన పట్టాల పంపిణీ సంబరం మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగింది. లేఔట్‌లోని ప్రతి ప్లాట్‌ వద్దకు స్వయంగా వెళ్లి పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనంత అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.