మానవ మనుగడకు చెట్లే ఆధారం..
Ens Balu
2
Vizianagaram
2020-12-27 21:29:02
మానవ మనుగడకు చెట్లె ఆధారమని కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటి, భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని అందించాలని పిలుపు నిచ్చారు. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గాలన్నా, సకాలంలో వర్షాలు పడాలన్నా కేవలం మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం పట్టణ పేదలకోసం రూపొందించిన గుంకలాం లేఅవుట్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం కలెక్టర్ ప్రారంభించారు. ఇక్కడి చెరువు చుట్టూ మొక్కలను నాటారు. వాటికి ట్రీ గార్డులు అమర్చి, నీళ్లు పోశారు. నాటిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ ఎస్.జానకి రావు, పశు సంవర్ధక శాఖ జెడి డాక్టర్ ఎంవిఏ నర్సింహులు, డుమా పిడి ఏ. నాగేశ్వరరావు, తాసిల్దార్ ప్రభాకర రావు, ఎంపిడివో నాగ వెంకట చైనులు, మున్సిపల్ ఇంజనీర్ డాక్టర్ కె. దిలీప్, మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాసరావు, మున్సిపల్ ప్లాంటేషన్ ఏ. రవి, హరిత విజయనగరం కో-ఆర్డినేటర్ రామ్మోహన్, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.