వివాదాస్పదంగా శ్రీశైల దేవస్థావస్థానం..
Ens Balu
3
Srisailam
2020-12-27 21:56:29
కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశైలం దేవస్థానంలో చివరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. తొమ్మిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం గోశాల పర్యవేక్షకురాలు సాయికుమారిని ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా శ్రీశైలం గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ,ఆలయ షాపింగ్ కాంప్లెక్ అన్య మతస్తులచేతుల్లో చిక్కుకుపోయి లక్షల ఆదాయం గండిపడిందని,పరాయి మతస్తుల పెత్తనం పెరిగిందని,కాటేజెర్లముందు కార్ పార్కింగ్ స్థలం లో అక్రమదుకాణాలు వెలిసి తీవ్ర అసౌకర్యం కల్గిస్తున్నారనే ఆరోపణల నేపధ్యంలో ఈ విషయములు అటు రాజకీయపక్షాల్లోనూ,ఇటు మీడియా, సోషల్ మీడియాలో విపరీతమై ప్రచారం జరిగింది. గోవుల విషయంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రజాక్, చక్రపాణి కలిసి శ్రీశైలం దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై అటు రాజాసింగ్, ఇటు రజాక్, శిల్ప చక్రపాణి మధ్య మాటల యుద్ధం సాగింది. కాగా, ఈ ఆరోపణల పర్వం నేపథ్యంలో గోశాల ఉద్యోగుల బదిలీపై ఇప్పటికైనా కొంత చర్య జరిగినందుకు హిందూత్వ వాదులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా అన్య మతస్తుల కొలువులు,అలాగే హిందు ఆలయాల ఆదాయాన్ని ఇతర మతాలకు చెందిన నిర్మానాలకు మళ్లించటం అరికట్టి హిందు ఆలయాల్లో అన్యమతస్తుల ఉద్యోగాలు,తొలగించాలని హిందూత్వ వాదులు కోరుతున్నారు.