సీఎం పర్యటన విజయవంతం కావాలి..
Ens Balu
3
శ్రీకాలహస్తి
2020-12-27 21:57:50
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు. ఈ నెల 28 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తి నియజకవర్గం ఊరందూరు లో పర్యటన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం సభా వేదిక వద్ద ఏర్పాట్లను డిప్యూటీ సీఎం రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి మంత్రి పర్యటన సలహాదారు తలశీల రఘురాం, చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డెప్ప, శ్రీకాళహస్తి, మదనపల్లె ఎం ఎల్ ఏ లు బియ్యపు మధుసూదన్ రెడ్డి, నవాజ్ బాషా, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, జేసీ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, జె సి (సంక్షేమం) రాజశేఖర్, తదితర జిల్లా స్థాయి అధికారలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు పట్టాలిచ్చే కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.