రేపే రైతులకు వైఎస్సార్ రైతు భరోసా..


Ens Balu
4
Machilipatnam
2020-12-28 17:55:03

ఈ నెల 29వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 2 వేలుతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ సైతం జగన్ ప్రభుత్వం రైతులకు   చెల్లించబోతున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు.  సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి స్వయంగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత పోతేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు మంత్రిని కలిసి తమ ఇబ్బందిని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పొలాలు నేలపై ఒరిగిపోయాయని పదే పదే వ్యవసాయాధికారిణీకి చెబుతున్నా ఆమె   తమ పేర్లను నమోదు చేయడం లేదని, అదేమని అడిగితే పక్క మండలాల్లో కలెక్టర్ , జె సి లు వ్య్వవసాయ క్షేత్రాలు పరిశీలించారని అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ నష్టం జరిగినట్లు ఎలా రాస్తానని తమతో వాదిస్తున్నట్లు మంత్రి ఎదుట రైతులు వాపోయారు.  ఈ విషయమై స్పందించిన మంత్రి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులతో మాట్లాడి రైతులకు ఏమైనా నష్టం జరిగితే పరిణామాలు చాలా  తీవ్రంగా ఉంటాయని వెంటనే రైతుల సమస్యను పరిష్కరించాలని జె డి ఆదేశించారు.  ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇన్‌పుట్‌ సబ్సీడీ  ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బుతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీని ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొందని దీంతో డిసెంబరు 29 తేదీన ( రేపు మంగళవారం )  50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలను వ్యవసాయ శాఖ జమ చేయనున్నట్లు తెలిపారు.  స్థానిక 6 వ వార్డుకు ( కొబ్బరితోట) చెందిన సంకుల శిరీషా మంత్రికి తన అభ్యర్ధనను తెలిపింది, తాను ప్రస్తుతం  గిలకలదిండిలో వార్డు అడ్మిన్ గా పనిచేస్తున్ననని 26 వ వార్డు లో  అడ్మిన్ ఖాళీ ఉందని తనను అక్కడకు బదిలీ చేయాలనీ కోరింది.           హనుమాన్ జంక్షన్ సమీపంలోని  వీరవల్లి గ్రామానికి చెందిన కాటూరు కనకదుర్గ మంత్రిని కలిసి తన గోడు వెళ్లబోసుకొంది. తమ ఇంటిపై తనఖా రిజిస్ట్రేషన్ చేశామని తమ అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఇపుడు బ్యాంకు వారు 11 లక్షల రూపాయలను తమను చెల్లించమని వత్తిడి తెస్తున్నారని మీరే మమ్ములను కాపాడాలని వేడుకొంది.  స్థానిక సుల్తాన్ నగరానికి చెందిన చిట్టిబొమ్మ సుబ్బరావమ్మ మంత్రికి తన కష్టాన్ని చెప్పుకొంది. తనకు వృద్ధ్యాపు పింఛన్ రావడం లేదని అలాగే అగ్రి గోల్డ్ తాలూకా డబ్బు ఇంకా సెల్లించలేదని తెలిపింది.