ఆర్ ఓ ఎఫ్ ఆర్ లబ్దిదారుల జాబితా గిరిభూమిలో ..
Ens Balu
2
2020-08-10 21:02:37
జిల్లా స్దాయి కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అటవీ హక్కపత్రాల జాబితాను గిరి భూమి వెబ్ సైట్‌లో నమాదు చేయాలని సమీకృత గిరిజనాభివృద్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా.వేంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఐటిడి ఏ కార్యాలయం నుంచి 11 మండలాల తాహశీల్దారులు, మండల అభివృధ్ది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డి ఎల్ సి సమావేశంలో 34 వేల క్లైములకు ఆమోదము పొందడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన కుటుంబానికి కనీసం రెండు ఎకరాలు భూమి ఉండాలని ఆదేశించారని చెప్పారు. ఆ వివరాలు తెలుసుకోవడం కోసమే ఈనెల 9 జరగాల్సిన పట్టాలు పంపిణీ వాయిదా వేసారన్నారు. ఎవరికైన రెండు ఎకరాల కంటే తక్కవ ఉంటే సర్వే చేసి రెండు ఎకరాలు భూమి కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు ఇవ్వకూడదన్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులను తాహశీల్దార్ కార్యాలయాలకు పంపించి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఆన్‌లైన్ లో నమోదు చేయించాలని ఎంపిడి ఓను ఆదేశించారు. ప్రతీ మండలంలో కనీసం 2500 మంది లబ్దిదారులున్నారని, హుకుంపేట మండలంలో అత్యధికంగా 6300 మంది ఆర్ ఓ ఎఫ్ ఆర్ లబ్దిదారులున్నారన్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతా, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్, ఆధార్ సంఖ్య సక్రమంగా గిరిభూమిలో నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. తాహశీల్దారులు, ఎంపిడి ఓల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.