29 నుంచి ఆసెట్, ఆఈట్ వెబ్ కౌన్సెలింగ్..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-28 18:20:04
ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఆసెట్, ఆఈట్ ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లకు ఈ నెల 29 నుంచి అవకాశం ఇస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు. సైన్స్ కోర్సుల వారు ఈ నెల 29, 30వ తేదీలలో, ఆర్టస్ విభాగాల వారు ఈ నెల 31, జనవరి 1వ తేదీలలో, పరీక్ష అవసరం లేని కోర్సులవారు జనవరి 2వ తేదీన, ఆసెట్‌లో అన్ని కోర్సుల్లో మిగిలిన విద్యార్థులు జనవరి 3వ తేదీన వెబ్ ఆప్షన్లు ఇవ్వవలసి వస్తోంది. ఆఈట్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 4,5 తేదీలలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు సీట్లు జనవరి 6న కేటాయిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు జనవరి 7 నుంచి 12 తేదీల వరకు నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 18, 19 తేదీలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. జనవరి 20వ తేదీనుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.