మహిళా సాధికారతతో సుస్థిర ప్రగతి సాకారం..


Ens Balu
2
ఆంధ్రాయూవర్శిటీ
2020-12-28 18:22:59

మహిళా సాధికారతతో సుస్థిర ప్రగతి సాధ్యపడుతుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ‌స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ ఆచార్యులు డాక్టర్‌ ‌టి.షారోన్‌ ‌రాజు రచించిన ‘ విమెన్‌ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ఎం‌పవర్‌మెంట్‌’ ‌పుస్తకాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ మహిళలకు విద్య ఎంతో ఆవశ్యకమని, ఈ దిశగా వర్సిటీ పూర్తిస్థాయిలో కృషిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల బధ్రత, సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి మహిళాభ్యుదయానికి బాటలు వేస్తున్నారన్నారు. పుస్తక రచయిత డాక్టర్‌ ‌షారోన్‌ ‌రాజును  అభినందించారు. ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత మాట్లాడుతూ నేడు మహిళలకు లభిస్తున్న ప్రోత్సాహం, సహకారం, గుర్తింపు అపారమన్నారు. పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, డాక్టర్‌ ‌క్రిష్ణమంజరి పవార్‌లు మాట్లాడుతూ అట్టడుగు, అణగారిన వర్గాలు, మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడం శుభపరిణామమన్నారు.  మహిళలకు విద్య ఎంతో ఆవశ్యకమన్నారు. ఉన్నత విద్య అపార అవకాశాలను కల్పిస్తుందనే వాస్తవాన్ని, మహిళా విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ డాక్టర్‌ ‌షారోన్‌ ‌రాజు పుస్తక రచన చేయడం శుభపరిణామమన్నారు.పుస్తక రచయిత డాక్టర్‌ ‌టి.షారోన్‌ ‌రాజు పుస్తకాన్ని వివరిస్తూ మహిళా విద్య-సాధికారత ప్రాధాన్యతను వివరిస్తూ ప్రముఖంగా భారతీయ విద్యా వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలలో మహిళా విద్యకు అందించిన ప్రాధాన్యత, ప్రోత్సాహం, మహిళల హక్కులు, మహిళల సాధికారత- దృక్కోణాలు, మహిళా విద్య ఫలితాలు-ప్రతికూలతలతోపాటు జాతీయ విద్యా విధానంలో మహిళా విద్య ఆవశ్యకత తదితర అంశాలను పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు.కార్యక్రమంలో  రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.