కరోనా నియంత్రణకు మాస్కు రక్షణ కవచం..


Ens Balu
3
Srikakulam
2020-12-28 18:33:29

మాస్కు ధారణే కరోనా నివారణకు రక్షణ కవచమని మార్కెటింగ్ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. కోవిడ్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో గల రైతు బజార్లు, అంపోలు మార్కెట్ యార్డు తదితర ప్రదేశాల్లో  కోవిడ్-19 ప్రవర్తన నియమావళిపై సోమ వారం పలు కార్యక్రమాలను చేపట్టారు. రైతులకు, గోదాములలో పని చేసే కలాసీలు తదితరలకు కోవిడ్ వ్యాప్తి, ఎదురయ్యే సమస్యలు, వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. మాస్కు ధారణ అవసరమని, మాస్కు రక్షణ కవచంలా పనిచేస్తుందని సహాయ సంచాలకులు అన్నారు. ఆరు అడుగుల భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు. సామాజిక క్రమశిక్షణ కలిగి కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కె.కార్తీక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి బి. రవికిరణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.